For Money

Business News

17000 దిగువకు నిఫ్టి

ఇవాళ్టి నిఫ్టి కదలికలు చూశాక… నిఫ్టి 17000 దిగువకు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్ నాగరాజ్‌ శెట్టి అంటున్నారు. గత కొన్ని నెలల నుంచి హైయ్యర్, లోయర్‌ టాప్స్‌ నుంచి నిఫ్టి చాలా బలహీనంగా కన్పిస్తోందని.. అంటే దీనర్థం లాంగ్‌ బేర్‌ కాండిల్స్‌ ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. మార్కెట్‌ ఎలా పయనించనుందో సోమవారం నాటి ట్రేడింగ్ మరో ఉదాహరణ అని ఆయన అన్నారు. స్వల్ప కాలీన నిఫ్టిలో పతనం కొనసాగుతుందని అన్నారు. పతనం కాస్త జోరుగా ఉండే అవకాశముందని నాగరాజ్‌ శెట్టి అన్నారు. 17300 స్టాప్‌లాస్‌తో నిఫ్టి 16950 లేదా 16850ని తాకే అవకాశముందని అన్నారు. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ చూస్తే… కాల్‌ ఆపన్ష్‌లో అత్యధిక ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 18000, తరవాత 17500 వద్ద ఉందని ఆయన చెప్పారు. అంటే మార్కెట్‌ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ స్థాయి దాటదన్నమాట. అలాగే పుట్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 16500, తరవాత 16000 వద్ద అత్యధికంగా ఉందని తెలిపారు. పుట్ రైటింగ్‌ 16900, 17200 వద్ద రాస్తున్నారని పేర్కొన్నారు. అదే కాల్‌ రైటింగ్ విషయానికొస్తే 17500, తరవాత 1800 వద్ద అధికంగా రాస్తున్నారిన తెలిపారు. డేటాను చూస్తుంటే నిఫ్టి రేంజ్‌ 16800 నుంచి 17700 మధ్య ఉన్నట్లు నాగరాజ్‌ శెట్టి తెలిపారు.