NIFTY TODAY: 17900 కీలకం
లిక్విడిటీ ముందు అనేక కీలక అంశాలను మార్కెట్ పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా కేంద్రం ఆపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 82 డాలర్లను దాటింది. ఫండమెంటల్స్పరంగా చాలా వీక్‌గా ఉన్నా లిక్విడిటీ ఇపుడు మార్కెట్ దిశను నిర్ణయిస్తోంది. ఇవాళ కూడా నిఫ్టి లాభాలతో ప్రారంభం కానుంది. శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు నష్టాల్లో క్లోజయ్యాయి. నిఫ్టి ఇవాళ 17900ని దాటుతుందేమో చూడాలి. ఎందుకంటే నిఫ్టికి ప్రధాన ప్రతిఘటన ఇక్కడే ఎదురు కానుంది. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 17890 ప్రాంతంలోనే 17910 స్టాప్‌లాస్‌తో అమ్మవచ్చని టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టిరి 17940పైన గట్టి మద్దతు ఉంది. ఇక నిఫ్టికి ఇవాళ 17810 కీలకం. అంటే క్రితం ముగింపు అన్నమాట. ఈ స్థాయికి దిగువకు వస్తే 17740 ప్రాంతంలో మద్దతు అందవచ్చు. మరి మార్కెట్ ఈ స్థాయికి పడుతుందా అన్నది అనుమానమే. అధిక స్థాయిలో అమ్మి… స్వల్ప లాభంతో బయటపడటం ఒక్కటే మార్గంగా కన్పిస్తోంది. టీసీఎస్, రిలయన్స్‌పై ఇన్వెస్టర్లు ఇవాళ ఆసక్తి చూపే అవకాశముంది.