For Money

Business News

NIFTY TODAY: నో సపోర్ట్‌

5, 10, 200 రోజుల చలన సగటుల దిగువకు నిఫ్టి రానుంది. దాదాపు కీలక మద్దతు స్థాయిలన్నీ పోయినట్లే. ఇవాళ భారీ నష్టాలు.. రేపు మార్కెట్‌కు సెలవు. ఎల్లుండి మార్కెట్‌ ఉంటుంది..కాని ఆ రోజు రాత్రే వడ్డీ రేట్లపై ఫెడ్‌ నిర్ణయం. సో మార్కెట్‌ ప్రధాన కీలక స్థాయిలో ఉంది. ఫెడ్‌ నిర్ణయానికి మార్కెట్లు ఎలా స్పందిస్తాయనేది చాలా కీలకంగా మారింది. సాధారణంగా ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచిన తరవాత మార్కెట్‌ పెరుగుతూ వచ్చింది. కాని ఈ సారి ఆ పరిస్థితి ఉండదని కొందరి వాదన. మరికొందరు అనలిస్టలు మాత్రం… అర శాతం వడ్డీ రేటును మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసిందని అంటున్నారు. కాని డాలర్‌ అనూహ్యంగా పెరుగుతోంది. అలాగే బాండ్‌ ఈల్డ్స్‌ కూడా. ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం తరవాత ఇవి తగ్గితేనే ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించే అవకాశముంది. లేదంటే మరింత పతకం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టిలో చాలా జాగ్రత్తగా ట్రేడింగ్‌ చేయాల్సి ఉంటుంది.నిఫ్టి క్రితం ముగింపు 17102. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16900 దిగువకు పడిపోనుంది. నిఫ్టి 16,879కి కీలకం. ఈ స్థాయి దిగువకు వెళితే నిఫ్టికి తదుపరి మద్దతు 16777.16924 దాటితే కాస్త మద్దతు లభించవచ్చు. ఫెడ్‌ నిర్ణయం వెల్లడి అయిన తరవాత మార్కెట్‌లో ట్రేడ్‌ చేయడం మంచిది. అప్పటి వరకు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది.