మిడ్ క్యాప్స్ హవా

మార్కెట్ ఇవాళ పటిష్ఠంగా ట్రేడవుతోంది. ఉదయం నుంచి నిఫ్టి లాభాల్లో ఉంది. అమెరికా మార్కెట్లు ఆశాజనకంగా క్లోజ్ కావడంతో పాటు దేశీయంగా పలు కంపెనీలు ఆశాజనక ఫలితాలు ప్రకటించడంతో నిఫ్టికి 25000 దిశగా పయనిస్తున్నట్లు కన్పిస్తోంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇపుడు 145 పాయింట్ల లాభంతో 24724 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ముఖ్యంగా మిడ్ క్యాప్స్ షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2531 షేర్లు ట్రేడవుతుండగా 2035 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి షేర్లలో టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్‌లో ఉన్నాయి. ఇక నష్టాల్లో ఉన్న నిఫ్టి షేర్లలో టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఉన్నాయి.