స్థిరంగా ముగిసిన నిఫ్టి

మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ నుంచి డల్‌గా ఉంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగినా… మిడ్ సెషన్ తరవాత నిఫ్టి కోలుకుంది. గ్రీన్‌లోకి రానున్నా.. పరిమిత నష్టాలకే పరిమితమైంది. బ్యాంక్ నిఫ్టి కూడా నష్టాల నుంచి కోలుకుంది. స్టార్ షేర్లు మాత్రం స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు. నిఫ్టి ఇవాళ 42 పాయింట్ల నష్టంతో 25019 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి నెక్ట్స్, నిఫ్డి మిడ్ క్యాప్ 100 సూచీలు మాత్రం ఒక శాతం లాభాలతో ముగిశాయి. అండర్ టోన్ కూడా పాజిటివ్‌గా ఉంది. ఇవాళ ఎన్ఎస్ఈలో 2971 షేర్లు ట్రేడవగా, 1969 షేర్లు లాభాల్లో ముగిశాయి. రక్షణ రంగానికి చెందిన షేర్లకు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభిస్తూనే ఉంది. ఇవాళ కూడా బీఈఎల్ షేర్ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది.తరువాతి స్థానాల్లో టాటా కన్జూమర్, బజాజ్ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజస్, హెచ్‌యూఎల్ ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో భారతీ ఎయిర్ టెల్ టాప్ లూజర్‌గా నిలిచింది. ఇవాళ ఈ కౌంటర్ ఒక శాతం దాకా షేర్లను బ్లాక్‌డీల్‌లో అమ్మారు. తరువాతి స్థానాల్లో హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ ఉన్నాయి.