18,000పైన ముగిసిన నిఫ్టి
నిఫ్టి కోలుకుని 18,000పైన ముగిసినా అనేక షేర్లు క్షీణించాయి. నిఫ్టి దాదాపు 150 పాయింట్లు క్షీణించి17,915కి చేరినా .. ఉదయం టెక్నికల్ అనలిస్టులు పేర్కొన్నట్లు 17,900 ప్రాంతంలో నిఫ్టికి గట్టి మద్దతు లభించింది. మిడ్ సెషన్ తరవాత నిఫ్టి నష్టాలన్నీ పూడ్చుకుని ఒక దశలో లాభాల్లోకి వచ్చింది. చివర్లో వచ్చిన ఒత్తిడి కారణంగా 27 పాయింట్ల నష్టంతో 18,017 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి నెక్ట్స్ కూడా ఇలాగే ముగిసినా.. మిడ్ క్యాప్ షేర్ల సూచీ అరశాతంపైగా నష్టంతో ముగిసింది. ఇక బ్యాంక్ నిఫ్టి ఏకంగా 0.88 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టిలో 27 షేర్లు నష్టంతో ముగిశాయి. కాని మార్కెట్లో అనేక షేర్లలో ఒత్తిడి కన్పించింది.