మూడో వంతు పాయే

నిన్న లాభాల్లో దాదాపు మూడో వంతు అంటే 346 పాయింట్లు ఇవాళ పాయే. నిఫ్టి ఇవాళ ఉదయం నుంచి నష్టాల్లోనే ట్రేడవుతోంది. రాత్రి అమెరికా, చైనా డీల్ కుదిరిన తరవాత వాల్‌స్ట్రీట్ భారీ లాభాల్లో ట్రేడైంది నాస్‌డాక్ నాలుగున్నర శాతంపైగా లాభపడింది. అయితే మన మార్కెట్ ఈ డీల్‌ను కూడా నిన్ననే డిస్కౌంట్ చేసినట్లు కన్పిస్తోంది. దీంతో ఇవాళ ఒకదశలో 24547 పాయింట్లకు క్షీణించింది. దాదాపు అదే స్థాయిలో అంటే 24578 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి క్షీణించినా…మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల సూచీలు గ్రీన్లో క్లోజ్ కావడం విశేషం. ఇవాళ డిఫెన్స్ షేర్లు గణనీయంగా పెరిగాయి. నిఫ్టిలో టాప్ గెయినర్‌గా బీఈఎల్ నిలిచింది. ఈ షేర్ ఇవాళ నాలుగు శాతంపైగా పెరిగింది. తరువాతి స్థానాల్లో జియో ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా ఉన్నాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో ఇన్ఫోసిస్ టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో ఎటర్నల్, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ ఉన్నాయి. ఇవన్నీ దాదాపు మూడు శాతం నష్టంతో ముగిశాయి.