For Money

Business News

MID SESSION: షేర్‌ మార్కెట్‌ భారీ పతనం

విదేశీ ఇన్వెస్టర్లు ఇన్నాళ్ళూ సూచీని పెంచుతూ వచ్చి… ఆప్షన్ష్‌లో చావుదెబ్బ కొట్టారు. 18,000 కాల్స్‌ను గత కొన్ని రోజులుగా అమ్మడమేగాక, పుట్స్‌ను కొనుగోలు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఇవాళ భారీగా లాభపడ్డారు. 18,000 అక్టోబర్‌ నెల కాల్ ఆప్షన్‌ ఇవాళ 89 శాతం క్షీణించింది. పుట్స్‌ ఆప్షన్‌ 345 శాతం పెరిగింది. రెండు విధాలా ఇవాళ నిఫ్టితో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా లబ్ది పొందారు. బై ఆన్‌ డిప్స్‌ సూత్రం ఫాలో అయిన వారు ఇవాళ భారీగా బుక్కయ్యాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడా నిఫ్టికి గట్టి మద్దతు అందలేదు. దిగువ స్థాయి నుంచి పెరిగినా… రెట్టింపు జోరుతో నిఫ్టి పడుతూ వచ్చింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 225 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం నిఫ్టి 17,961 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టికి ఇక్కడ గట్టి మద్దతు ఉంది. ఈ మద్దతు కోల్పోతే మాత్రం 17948-17930 వద్ద మరో మద్దతు లభించవచ్చు. ఇక్కడ గనుక మద్దతు లభించకపోతే నేరుగా 17,850ని తాకే అవకాశాలు ఉన్నాయి. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉన్నందున నిఫ్టికి 17960-50 ప్రాంతం నుంచి కోలుకుంటుందేమో చూడాలి.