For Money

Business News

నిఫ్టిని డెబ్బతీసిన ఐటీ

ఇన్ఫోసిస్‌ ఫలితాలు మార్కెట్‌ మూడ్‌ను దెబ్బతీశాయి. ఇన్ఫోసిస్‌ ఫలితాల తరవాత రాత్రి అమెరికా మార్కెట్‌లో కంపెనీ ఏడీఆర్‌ దాదాపు ఆరు శాతం నష్టంతో ముగిసింది. ఇవాళ మన మార్కెట్లలో కూడా ఐటీ ఇదే స్థాయి నష్టాలతో ముగిసింది. అలాగే ఇవాళ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసిన సూచీ.. నిఫ్టి ప్రైవేట్‌ బ్యాంక్‌ సూచీ. రిలయన్స్‌ షేర్‌ కారణంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ ఒక శాతం పెరిగింది. అలాగే రియాల్టి కూడా. ఇక మిగిలిన సూచీల్లో ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టి కూడా 1.75 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి ఉదయం నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఒకదశలో 23292 స్థాయిని తాకిన నిఫ్టి ఆరంభంలోనే 23100 స్థాయిని తాకింది. తరవాత మిడ్‌ సెషన్‌ లోగా నిఫ్టి భారీ నష్టాల్లోకి జారకుని… తరవాత కోలుకుంది. అయినా నిఫ్టి అతి కష్టంతో 23202 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 109 పాయింట్ల నష్టపోగా, సెన్సెక్స్‌ 410 పాయింట్ల నష్టంతో ముగిసింది. మిడ్‌ క్యాప్‌ సూచీ భారీ నష్టాల్లోకి జారుకున్నా.. వెంటనే కోలుకుంది. మొత్తం వారంలో కూడా ఈసూచీ పెద్దగా పడలేదు. ఇక నిఫ్టి షేర్ల విషయానికొస్తే బీపీసీఎల్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దీనితో పాటు రిలయన్స్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, నెస్లే వంటి షేర్లు రెండు శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. ఇక నిఫ్టి లూజర్స్‌లో ఇన్ఫోసిస్‌ టాప్‌లో నిలిచింది. ఈ షేర్‌ 5.75 శాతం నస్టపోగా, యాక్సిస్‌ బ్యాంక్‌ నాలుగు శాతంపైగా, శ్రీరామ్‌ఫైనాన్స్‌ 3.7 శాతం నష్టంతో ముగివాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, విప్రో కంపెనీల షేర్లు రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి.