కీలక స్థాయిలు ఔట్

మార్కెట్ రోజురోజుకీ మరింత బలహీనపడుతోంది. కీలక స్థాయిలను కోల్పతోంది. అత్యంత కీలక స్థాయి అయిన 22500 స్థాయిని కోల్పోవడంతో… ఇపుడు 22200 స్థాయి డేంజర్ జోన్‌లో పడింది. ఈ స్థాయి వద్ద మార్కెట్ నిలబడుతుందా అన్న చర్చ ఇపుడు మార్కెట్‌లో వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మార్కెట్‌కు అండగా ఉన్న బ్యాంక్ నిఫ్టి కూడా ఇవాళ ఢమాల్ అంది. బ్యాంక్ నిఫ్టి 0.82 శాతం క్షీణించగా, ఫైనాన్షియల్ ఇండెక్స్ 0.53 శాతం తగ్గింది. నిఫ్టిలో ఏకంగా 47 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2282 షేర్లు ట్రేడవుతుండగా లాభాల్లో ఉన్న షేర్ల సంఖ్య 249 మాత్రమే. 62 షేర్లు లోయర్ సర్క్యూట్ ఉండగా, 421 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. నిఫ్టిలో టాప్ గెయినర్స్‌గా కోల్ ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, విప్రో, టాటా స్టీల్ ఉన్నాయి.