ఆరంభంలోనే ఒత్తిడి

మార్కెట్ గిఫ్ట్ నిఫ్టి స్థాయిలోనే ప్రారంభమైనా.. వెంటనే వచ్చిన అమ్మకాల ఒత్తిడి రావడంతో ఆరంభం లాభాలు చాలా వరకు కరిగిపోయాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 22261 స్థాయిని తాకింది. ఇపుడు 22,157 పాయింట్ల వద్ద అంటే 32 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిని బ్యాంక్ నిఫ్టి గట్టిగా దెబ్బకొట్టింది. బ్యాంక్ నిఫ్టి ప్రస్తుతం 0.36 శాతం నష్టంతో ఉంది. మిడ్ క్యాప్ సూచీ కూడా అంతే. నిఫ్టిలో 27 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టిలో ఎం అండ్ ఎం, అల్ట్రాటెక్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. అలాగే ఇండిస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా షేర్లు రెండు శాతం నష్టంతో నిఫ్టి టాప్ లూజర్స్‌లో ముందున్నాయి. పాలీక్యాబ్ ఇవాళ మరో 1.3 శాతం క్షీణించింది. వోల్టాస్ రెండు శాతంపైగా లాభంతో ఉంది.