For Money

Business News

లాభాలన్నీ పాయే… అదీ సంగతి

దిగువన మద్దతు అందిందని… షార్ట్‌ కవరింగ్‌ వస్తుందన్న బుల్స్‌ ఆశలను వమ్ము చేస్తూ నిఫ్టి నష్టాల్లోముగిసింది. మొత్తం లాభాలన్నీ పోయాయి. కేవలం గంటన్నరలో 340 పాయింట్ల నష్టపోయింది నిఫ్టి. యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ఓపెన్‌ అయింది. 16083 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయినా ఆ స్థాయిలో నిఫ్టి నిలబడలేకపోయింది. చివర్లో 15740 స్థాయికి క్షీణించిన నిఫ్టి 15782 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 26 పాయింట్ల నష్టంతో క్లోజైంది. నిఫ్టి తరవాత ప్రధాన షేర్లు ఉండే నిఫ్టి నెక్ట్స్‌ 0.45 శాతం పడిపోయింది. అలాగే బ్యాంక్‌ నిఫ్టి 1.23 శాతం నష్టపోవడంతో నిఫ్టి… పై స్థాయిలో నిలబడలేకపోయింది. ప్రధాన సూచీల్లో నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ 0.96 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో 25 షేర్లు నష్టపోయాయి. నిఫ్టి టాటా మోటార్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలవగా, 5 శాతం నష్టంతో హిందాల్కో నష్టంతో ముగిసింది.