For Money

Business News

ఒమైక్రాన్‌ భయాలు: నష్టాల్లో ముగిసిన నిఫ్టి 

మోడెర్నా కంపెఈ సీఈఓ చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల మార్కెట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇపుడున్న వ్యాక్సిన్లకు లొంగని ఒమైక్రాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని ఆయన హెచ్చరించారు. ఒమైక్రాన్‌కు టీకా వచ్చేందుకు కొన్ని నెలలు పడుతుందని ఆయన చెప్పారు.దీంతో అప్పటి దాకా రికవరీ బాటలో ఉన్న స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు, ఇపుడు యూరో మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఆయిల్, కరెన్సీ మార్కెట్లు కూడా దెబ్బతిన్నాయి.ఉదయం రికార్డు స్థాయిలో 17,324 పాయింట్ల స్థాయికి చేరిన నిఫ్టి మోడెర్నా సీఈఓ కామెంట్లతో భారీగా క్షీణించి 16,937కు పడిపోయింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 16,983 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 70 పాయింట్లు నష్టపోయింది. ఇతర సూచీలన్నీ నష్టాల్లో క్లోజ్‌ కాగా ఒక్క మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం గ్రీన్‌లో ముగిసింది.