NIFTY LEVELS: మాంద్యం భయాలు
నిఫ్టి గత శుక్రవారం 15752 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మాంద్యం భయం పెరుగుతోంది. నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమైతే.. కాస్సేపు ఆగి ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇవాళ అమెరికా మార్కెట్లకు సెలవు. పైగా అమెరికా ఫ్యూచర్స్ అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఆసియా మిశ్రమంగా ఉంది. యూరప్ ఫ్యూచర్స్ తెలిసేవరకు మార్కెట్‌లో అనిశ్చితి ఉండొచ్చు. ఆ తరవాత క్లియర్ డైరెక్షన్‌లో వెళ్ళొచ్చు. రిలయన్స్ గత శుక్రవారం భారీగా క్షీణించింది. మరి ఇవాళ ఆ షేర్ ఎలా రియాక్ట్ అవుతుందో కీలకం. ఎందుకంటే అంతపెద్ద పతనాన్ని కూడా మార్కెట్ తట్టుకుంది.ఈ నేపథ్యంలో నిఫ్టి లెవల్స్ చూసి ట్రేడ్ చేయండి. నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ – 15920
రెండో ప్రతిఘటన – 15880
తొలి ప్రతిఘటన – 15848
నిఫ్టికి కీలకం – 15687
తొలి మద్దతు – 15656
రెండో మద్దతు – 15625
డౌన్ బ్రేకౌట్ – 15577
నిఫ్టి
50 EMA – 16184
100 EMA – 16528
నిఫ్టి బ్యాంక్
50 EMA – 34421
100 EMA – 35180