NIFTY TODAY: ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్
నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16000 స్థాయిని కోల్పోయే అవకాశముంది. ప్రపంచ మార్కెట్ల తాకిడితో పాటు ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ కూడా ఉంది. ఇప్పటి వరకు నిఫ్టి ఓవర్‌సోల్డ్ జోన్‌లో ఉందని టెక్నికల్స్ చెబుతూ వచ్చాయి. అయితే నిన్న భారీ ఎత్తున పుట్ రైటింగ్ జరిగింది.16,200 పుట్ రైటింగ్ ఓపెనింగ్ ఇంటరెస్ట్ ఏకంగా 20 లక్షల కాంట్రాక్ట్‌లు అదనంగా చేరాయి. ఇవన్నీ ఇవాళ ట్రేడింగ్ ఆరంభంలోనే షార్ట్ కవరింగ్‌కు పాల్పడుతారు. అంటే నిఫ్టి భారీగా క్షీణించనుంది. ఇవాళ పుట్ రైటర్స్ ఇవాళ భారీగా నష్టపోనున్నారు. చిన్న ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌లో చాలా పుట్ లేదా కాల్ కాంట్రాక్ట్ కొంటారు. గరిష్ఠంగా వారి పెట్టుబడి పోతుంది. కాని పుట్ లేదా కాల్ రైటింగ్ చేసినవారికి నష్టాలు అపరిమితంగా ఉంటాయి. కాబట్టి ఇవాళ బేర్ ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడి తెస్తారు. 16000 నుంచి 162000 పుట్స్ రైట్ చేసినవారు ఇవాళ తమ పొజిషన్స్ కవర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఓపెనింగ్ దారుణంగా ఉంటుంది. ఇక నిఫ్టి ఇవాళ్టి టెవల్స్.
అప్ బ్రేకౌట్ 16284
రెండో ప్రతిఘటన 16172
తొలి ప్రతిఘటన 16152
నిఫ్టి కీలక స్థాయి 16023
తొలి మద్దతు 15956
రెండో మద్దతు 15900
డౌన్ బ్రేకౌట్ 15805