For Money

Business News

NIFTY TODAY: పెరిగితే అమ్మండి

మార్కెట్‌ 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నపుడు ఇతర అంశాలు చూడటం అనవసరం. మార్కెట్‌కు దూరంగా ఉండండి. క్రూడ్‌, డాలర్‌ ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను శాసిస్తున్నాయి. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నేపథ్యంలో నిఫ్టి 15,880 అత్యంత కీలక స్థాయిగా మారింది. అన్ని సపోర్ట్‌ లెవల్స్‌ పోయినందున… నిఫ్టి కొనే సాహసం చేయొద్దని… పెరిగితే అమ్మడమే బెటర్‌ అని అనలిస్టులు అంటున్నారు. ఇవాళ్టికి లెవల్స్‌ దిగువన ఇస్తున్నాం. ఈ లెవల్స్‌ కేవలం ఇన్వెస్టర్ల అవగాహన కోసం మాత్రమే. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది. భారీగా తగ్గింది కదా అని కొనుగోలు చేస్తే బాగా నష్టపోయే ప్రమాదముంది. ముఖ్యంగా ఆప్షన్స్‌  జోలికి అసలు వెళ్ళొద్దు. మార్కెట్‌ నిలదొక్కుకునేంత వరకు నిఫ్టి లెవల్స్‌ను గమనించండి. అంతే.

నిఫ్టికి ఇవాళ్టి లెవల్స్‌

అప్‌ బ్రేకౌట్‌ 16182
రెండో ప్రతిఘటన 16044
తొలి ప్రతిఘటన 15991
నిఫ్టికి కీలక స్థాయి 15881
తొలి మద్దతు 15776
రెండో మద్దతు 15740
డౌన్‌ బ్రేకౌట్‌ 15385