పెరిగితే అమ్మండి
సింగపూర్ నిఫ్టి ఇవాళ 50 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 18197. అంటే నిఫ్టిఇవాళ ఓపెనింగ్‌లోనే 18100 ప్రాంతంలో ప్రారంభం కావొచ్చు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు కాస్సేపు వెయిట్ చేసి 18100 ప్రాంతంలో కొనొచ్చు. అయితే 18086 స్టాప్‌లాస్ పెట్టుకోండి. రిస్క్ వొద్దనుకునే ఇన్వెస్టర్లు 17967ను స్టాప్‌లాస్‌గా పెట్టుకుని… పడినపుడు నిఫ్టిని కొనొచ్చు. ఒకేసారి కాకుండా నిఫ్టి పతనమయ్యే కొద్దీ.. కొద్దికొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అయితే రెండో ప్రధాన మద్దతు 17967 వద్ద లభించవచ్చు. అయితే నిఫ్టిని షార్ట్ చేయొద్దు. నిఫ్టి పెరిగితే… 18200 లేదా 18250 ప్రాంతంలో ఒత్తిడి రావొచ్చు. కాబట్టి దిగువ స్థాయిలో నిఫ్టి కొనేవారు ఈ స్థాయిలో బయటపడటం మంచిదని సీఎన్‌బీసీ ఆవాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అనూజ్ సింఘాల్ సిఫారసు చేస్తున్నారు. 18250పై నిఫ్టి కనీసం అర గంటపైన నిలబడితేనే… ఆ తరవాత నిఫ్టి పెరిగే అవకాశం ఉందని.. మరి ఆ అవకాశం ఇవాళ లభిస్తుందా అన్నది చూడాల్సి ఉందన్నారు. అయితే దిగువ స్థాయిలో కొని… 18200 లేదా 18250 మధ్య బయటపడటం మంచిదని అనూజ్ సలహా ఇస్తున్నారు.