NIFTY LEVELS: నిలబడేనా…?
నిఫ్టి ఇవాళ 125 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమయ్యే అకవాశముంది. ఊహించిన స్థాయిలో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి రాకపోవడంతో కాల్ రైటింగ్ ఒత్తిడి తగ్గింది. 17900 వద్ద కాల్ రైటింగ్ ఓపెన్ ఇంటరెస్ట్ 62 లక్షలు ఉంటోంది. అంటే నిఫ్టికి ఇది ప్రధాన అవరోధమన్నమాట. ఒకవేళ నిఫ్టి పరుగులు తీసే పక్షంలో ఈ ఓపెన్ ఇంటరెస్ట్ 18000కు షిఫ్ట్ కావొచ్చు. కాని పుట్ రైటింగ్ బాగా తగ్గడంతో నిఫ్టి పడే ఛాన్స్ బాగా తగ్గింది. ప్రస్తుతం 17500 వద్ద పుట్ రైటింగ్ భారీగా ఉంది.ఈ స్థాయి వద్ద 54 లక్షల ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. సో… 17500 మార్కెట్‌కు గట్టి ప్రధాన మద్దతు స్థాయిగా భావించవచ్చు. నిఫ్టి ఈ నేపథ్యంలో నిఫ్టికి తొలి ప్రతిఘటన 17777 వద్ద ఎదురు కావొచ్చు. ఈ సెషన్లో నిఫ్టి తుదపరి ప్రతిఘటన స్థాయి 17810ను దాటుతుందా అన్న చూడాలి. ఎందుకంటే 17900 కాల్ రైటింగ్ పెరిగితే కాని ఇది సాధ్యం కాదు. మరి ఆ స్థాయిలో కాల్ రైటింగ్ వస్తుందా అన్నది చూడాలి. కాబట్టి ప్రతి సెషన్‌ను విడిగా చూడమని అనలిస్టులు అంటున్నారు. ఇవాళ్టికి నిఫ్టి 17810 స్థాయిని తాటితే తమ పొజిషన్స్‌ను స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో కొనసాగించ వచ్చని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే 17854 లేదా 17854 స్థాయి వద్ద తదుపరి ప్రతిఘటన ఉంది.
(పూర్తి విశ్లేషనకు వెబ్సైట్ దిగువన ఉన్న వీడియో చూడగలరు.)