17331 అత్యంత కీలకం
నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 17,759 కాగా, ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 300 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. సీఎన్‌బీసీ ఆవాజ్‌కు చెందిన డేటా అనలిస్ట్ వీరేన్ అంచనా ప్రకారం నిఫ్టికి 17427 వద్ద లేదా 17331 వద్ద మద్దతు లభించనుంది. ఈ మధ్య నిఫ్టి ఉన్నపుడు నిఫ్టిని షార్ట్ చేయొద్దని వీరేన్ సలహా ఇస్తున్నారు. 17331 స్థాయిని కోల్పోతే మాత్రం నిఫ్టిని షార్ట్ చేసే అంశాన్ని పరిశీలించవచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ స్థాయి కోల్పోతే నిఫ్టి నేరుగా 17226ని, ఆ తరవాత 17159 పాయింట్లను చేరుతుందని ఆయన అంచనా వస్తున్నారు. ఒకటో మద్దతు స్థాయి లేదా రెండో మద్దతు స్థాయి మధ్య నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అంటే 17331 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చన్నమాట. వీరేన్ పూర్తి రివ్యూ దిగువ వీడియో సెక్షన్లో చూడగలరు.