NIFTY TRADE: అధిక స్థాయిలో అమ్మండి
నిఫ్టి ఆల్‌టైమ్ హైలో ట్రేడవుతున్న సమయంలో… నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడమే బెటర్. స్ట్రిక్ట్ స్టాప్‌లాస్‌తో అమ్మండి. నిఫ్టి పడటం ఖాయం, కాని మళ్ళీ కోలుకునే అవకాశం కూడా ఉంది. ఇవాళ కూడా రెండు వైపులా ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. సింగపూర్ నిఫ్టి ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి ఇవాళ తొలి ప్రతిఘటన స్థాయి వద్ద ఓపెన్ కావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 16,614. సో… నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16,650ని అధిగమించవచ్చు. నిఫ్టి తొలి ప్రతిఘటన 16,670, రెండో ప్రతిఘటన 16,685 వద్ద ఎదురు కానుంది. నిఫ్టి రెండో ప్రతిఘటన స్థాయి వరకు వస్తుందేమో చూడండి. వస్తే 16700 స్టాప్‌లాస్‌తో అమ్మండి. రిస్క్ తీసుకునేవారు తొలి ప్రతిఘటన స్థాయి వద్ద అమ్మొచ్చు. నిఫ్టి పడితే నిన్నటి క్లోజింగ్ వరకు రావడం ఖాయం. ఆ స్థాయి కోల్పోతే మాత్రం 16,580 వరకు మద్దతు లేదు. ఆ స్థాయి కూడా కోల్పోతే 16,560 వరకు వెయిట్ చేయండి. ఆల్గో ట్రేడింగ్ లెవల్ ప్రకారం ఈ స్థాయిలో కచ్చితంగా నిఫ్టికి మద్దతు లభిస్తుంది. కాబట్టి 16,545 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు. టెక్నికల్‌గా నిఫ్టికి బై సిగ్నల్స్ ఉన్నా… నిఫ్టి ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. కాబట్టి నిఫ్టి రెండువైపులా కదలాడే ఛాన్స్ ఉంది. డే ట్రేడర్స్‌కు గుడ్ ఛాన్స్.