For Money

Business News

థ్యాంక్స్‌ టు చైనా.. 456 పాయింట్ల ర్యాలీ

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్‌ మార్కెట్‌కు చైనా నుంచి శుభవార్త అందింది. కేవలం 0.15 శాతం మేరకు వడ్డీ రేట్లను చైనా తగ్గించేసరికి ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. వృద్ధి రేటును పెంచేందుకు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. ఈ మాత్రం దానికే మార్కెట్లు హోరెత్తిపోయాయి. చైనాలో కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టిందని, చైనా వడ్డీ రేట్లతో మళ్ళీ అక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయన్న ఆశతో మెటల్స్‌ షేర్లలో భారీ ర్యాలీ వచ్చింది. ఆరంభంలో 16003 పాయింట్లను తాకిన నిఫ్టి తరవాత ఎక్కడ వెనుదిరిగి చూడలేదు. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్ల ట్రెండ్‌ కోసం స్వల్పంగా తగ్గినా.. తరవాత పుంజుకుంది. యూరో మార్కెట్లు కూడా రెండు శాతం దాకా లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం నుంచి ఒకశాతం వరకు లాభంతో ఉన్న రిలయన్స్‌ చివరి నిమిషంలో రిలయన్స్‌ ఏకంగా 6 శాతం పెరిగింది. నిఫ్టి 16266 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి… 16266 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 456 పాయింట్లు లాభపడింది. నిఫ్టిలో 48 షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. ఒక షేరు నష్టాల్లో ఉంటే ఆరు షేర్లు లాభాల్లో కొనసాగాయి. చిత్రంగా అన్ని సూచీలకంటే నిఫ్టినే అత్యధికంగా 2.89 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ 1.5 శాతం లాభంతో ముగిసింది. చాలా రోజుల తరవాత ఫార్మా షేర్లలో ర్యాలీ వచ్చింది. అయితే ఎల్‌ఐసీ మాత్రం రూ. 14.70 నష్టంతో రూ.826.15 వద్ద ముగిసింది.