NIFTY TRADE: కరెక్షన్ ప్రారంభమైనట్లే…
స్టాక్ మార్కెట్లో ప్రస్తుతానికి హానిమూన్ అయిపోయినట్లే. చైనా దెబ్బకు ఇపుడు ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనంబాట పట్టాయి. తమ దేశంలో భారీగా పెరిగిన టెక్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలతో పాటు రియల్ ఎస్టేట్లపై భారీ ఎత్తున ఆంక్షలు విధించడం చాలా చైనా షేర్లు పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు క్రమంగా తగ్గుతున్నాయి.సెప్టెంబర్‌లో ఎస్ అండ్ పీ 500 సూచీ 5 శాతం క్షీణించింది. మన మార్కెట్లలో ర్యాలీ కారణంగా అంతర్జాతీయ పరిణామాలను పట్టించుకోలేదు. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, ఈల్డ్ పెరగడంతో ఉద్దీపన ప్యాకేజీని క్రమంగా తగ్గించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా చాలా రోజుల తరవాత పతనంవైపు ప్రయాణం ప్రారంభించాయి. ఇవాళ్టి నుంచి వచ్చేవారం కూడా నిఫ్టి భారీగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టి దిగువ స్థాయిలో నిలదొక్కుకునే వరకు ‘BUY ON DIPS’కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్ట్రిక్ట్ స్టాప్‌లాస్ పాటించే ఇన్వెస్టర్లు నిఫ్టి పెరిగినపుడు అమ్మొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 17,618. సింగపూర్ స్థాయిలో నిఫ్టి ప్రారంభమైతే.. వెంటనే నిఫ్టి తొలిమద్దతు స్థాయి 17,490, తరవాత 17,460కి చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి. యూరో కూడా ఇతర మార్కెట్ల బాట పట్టే పక్షంలో మిడ్ సెషన్ తరవాత నిఫ్టి 174,40కి చేరొచ్చు. నిఫ్టి ఇవాళ తక్షణ మద్దతు స్థాయిలను కోల్పోనుంది. నిఫ్టిని షార్ట్ చేసినవారు తమ పొజిషన్స్‌ను కంటిన్యూ చేయొచ్చు.