నిఫ్టీ తప్ప… షేర్లలో భారీ అమ్మకాలు
పైకి నిఫ్టి గ్రీన్‌లో కన్పిస్తున్నా… మార్కెట్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఉదయం రెండో మద్దతు స్థాయి అయిన 15191 వద్ద నిఫ్టి కోలుకుంది. అక్కడి నుంచి కోలుకుని 15382ని తాకింది. మిడ్ సెషన్‌కు ముందు ఉత్సాహంగా పెరిగిన నిఫ్టి ఇపుడు 0.11 శాతం లాభంలో అంటే 17 పాయింట్ల లాభంతో 15310 వద్ద ట్రేడవుతోంది. కాని షేర్లలో మాత్రం భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. నిఫ్టినెక్ట్స్ 1.17 శాతం క్షీణించగా, నిఫ్టి మిడ్ క్యాప్ ఏకంగా 2 శాతం నష్టపోయింది. మెటల్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. దాదాపు అన్ని మెటల్ షేర్లు భారీ నష్టంతో ట్రేడవుతున్నాయి. వేదాంత ఏకంగా 15 శాతం నష్టంతో ఉంది. ఎన్‌ఎండీసీ, సెయిల్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ఇక మిడ్ క్యాప్‌లో టాటా పవర్ ఏకంగా 8 శాతం పైగా క్షీణించి రూ.200 దిగువకు వచ్చేసింది. రియాల్టి షేర్లలో కూడా అమ్మకాలు జోరు అధికంగా ఉంది.