23,000 దిశగా…

మార్కెట్ ఇవాళ ఆరంభంలో నష్టపోయినా… వెంటనే లాభాల్లోకి వచ్చేసింది. ప్రస్తుతం 99 పాయింట్ల లాభంతో 22651 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్స్ సూచీ మెల్లగా లాభాల్లోకి వచ్చింది. ఫైనాన్షియల్స్ నిఫ్టి అరశాతంపైగా లాభంతో ఉన్నా… బ్యాంక్ నిఫ్టి మాత్రం ఇంకా నిన్నటి స్థాయి వద్దే ట్రేడవుతోంది. బజాజ్ ట్విన్స్ ఇవాళ లాభాల్లోకి రావడం విశేషం. ట్రెంట్ మళ్ళీ రూ. 5000లోపలకు వచ్చేసింది. సూచీలు లాభాల్లో ఉన్నా… మెజారిటీ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం 2555 షేర్లు ట్రేడవుతుండగా, 1432 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే 110 షేర్లు అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి. నిఫ్టిలో కేవలం 14 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి షేర్లలో పవర్ గ్రిడ్ టాప్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉంది.