17,600 దిశగా నిఫ్టి
ఉదయం కొన్ని నిమిషాలు మాత్రమే నష్టాల్లో ఉన్న నిఫ్టి… అక్కడి నుంచి క్రమంగా బలపడుతూ లాభాల్లో ట్రేడవుతోంది. మిడ్ సెషన్ ప్రారంభమైన యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. లాభాలు పెద్దగా లేకున్నా..మార్కెట్ మూడ్ కాస్త పాజిటివ్‌గా ఉంది. ఒక అమెరికా ఫ్యూచర్స్ అరశాతం దాకా గ్రీన్‌లో ఉండటం విశేషం. నిఫ్టి ఇవాళ్టి గరిష్ఠస్థాయి 17586 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 121 పాయింట్లు లాభపడింది. దాదాపు అన్ని సూచీలు లాభాల్లో ఉన్నా… నిఫ్టి బ్యాంక్, నిఫ్టి ఫైనాన్షియల్స్ 1.7 శాతంపైగా లాభాల్లో ఉండటం విశేషం. నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు కూడా దాదాపు ఒక శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో 35 షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఎన్టీపీసీ నిఫ్టి టాప్ గెయినర్‌గా కొనసాగుతోంది.