విదేశీ మార్కెట్ల ట్రెండ్‌తో…
మిడ్ సెషన్ నుంచి యూరో మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లోకి రావడంతో మన మార్కెట్లు కూడా కోలుకున్నాయి. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి.. తరవాత నష్టాల్లోకి జారుకుని 16960ని తాకింది. అక్కడి నుంచి కోలుకుని 17142 పాయింట్లను తాకింది. క్లోజింగ్‌లో 140 పాయింట్ల లాభంతో 17123 పాయింట్ల వద్ద ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టి మార్కెట్‌కు అండగా నిలిచింది. బ్యాంక్ నిఫ్టి ఒక శాతంపైగా పెరిగింది. అలాగే నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు కూడా 0.8 శాతంపైగా లాభంతో ముగిశాయి. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ నిఫ్టి టాప్ ఫైవ్‌లో నిలిచాయి. నిఫ్టి నెక్ట్స్‌లో చోళ ఫైనాన్స్, డాబర్, మెక్‌డొవెల్స్ షేర్లు మూడు శాతం లాభపడ్డాయి. జొమాటొ ఇవాళ మూడు శాతం క్షీణించింది. నిఫ్టి మిడ్ క్యాప్‌లో టాప్ గెయినర్‌గా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ నిలిచింది.