అదే రేంజ్లో కదలాడిన నిఫ్టి
ఉదయం ఆల్గో ట్రేడర్స్ నిర్ణయించిన పరిధిలోనే నిఫ్టి ఇవాళ కదలాండింది. 15,750 వద్ద స్టాప్‌లాస్‌తో అమ్మి, 15,630 ప్రాంతంలో కొనుగోలు చేయమని టెక్నికల్ అనలిస్టులు ఉదయం సూచించారు. నిఫ్టి అదే రేంజ్లో కదలాడింది. ఉదయం 15,705 పాయింట్ల ప్రారంభమైన నిఫ్టి సరిగ్గా మిడ్ సెషన్‌కు ముందు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 15,635 పాయింట్లని తాకింది. అక్కడి నుంచి కోలుకున్న నిఫ్టి క్లోజింగ్ సమయానికి 15,738 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 42 పాయింట్ల లాభంతో 15,722 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టి స్వల్ప లాభాలతో క్లోజ్ కాగా, మిడ్‌క్యాప్ సూచీ స్థిరంగా ఎలాంటి లాభనష్టాలు లేకుండా క్లోజైంది. ఇవాళ కూడా మెటల్స్‌లో ఒత్తిడి కన్పించింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
దివీస్ ల్యాబ్ 4,526.00 2.04
రిలయన్స్ 2,131.55 1.60
ఐసీఐసీఐ బ్యాంక్ 640.25 1.49
కోల్ ఇండియా 147.50 1.27
టాటా కన్సూమర్ 765.15 1.20
నిఫ్టి టాప్ లూజర్స్
టాటా స్టీల్ 1,137.90 -2.20
JSW స్టీల్ 672.10 -1.24
బ్రిటానియా 3,552.00 -1.22
పవర్ గ్రిడ్ 228.00 -1.21
గ్రాసిం 1,488.50 -0.79