For Money

Business News

200 పాయింట్లు లాభపడిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాల్లో ముగిశాయి. బడ్జెట్‌ తరవాత షేర్‌ మార్కెట్‌ వచ్చిన ఈ ర్యాలీలో బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ షేర్లు భారీగా పెరిగాయి. బడ్జెట్‌లో మౌలకి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో బ్యాంకుల బిజినెస్‌ జోరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు కూడా గట్టి మద్దతు లభించింది. నిఫ్టి 203 పాయింట్లకు పైగా లాభంతో 17780 వద్ద ముగిసింది. దాదాపు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి వద్ద నిఫ్టి ముగిసింది. మిడ్‌ క్యాప్‌ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్‌ ఒక శాతం లాభంతో క్లోజ్‌ కాగా బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్షియల్స్ నిఫ్టి రెండు శాతం లాభంతో ముగిశాయి. ఇక నిఫ్టి షేర్లలో 40 షేర్లు లాభాలతో ముగిశాయి. బజాజ్‌ ట్విన్స్‌ టాప్‌ గెయినర్స్‌ టాప్‌ 5లో ఉండటం విశేషం. అలాగే ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఇవాళ మరింత పెరిగింది. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ఇవాళ మరో మూడు శాతంపైగా పెరగడం విశేషం.