17,000 దగ్గరగా నిఫ్టి…నిలబడేనా?
టెక్నికల్‌గా చాలా కీలకమైన స్థాయిలో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16977ని తాకిన నిఫ్టి ఇపుడు 16962 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 120 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టితో సహా దాదాపు ప్రధాన సూచీలన్నీ ఇదే స్థాయి లాభాలతో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు పెరుగుతున్నందున ఓఎన్‌జీసీ షేర్ టాప్ గెయినర్‌గా నిలిచింది. డాలర్ బలంగా ఉండటంతో ఐటీ షేర్లకు మద్దతు లభిస్తోంది. నిఫ్టి లూజర్స్‌లో ఆటో, ఫార్మా షేర్లు ఉన్నాయి. నిఫ్టి పెరిగితే అమ్మమని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని సలహా ఇస్తున్నారు. డే ట్రేడర్స్ స్వల్ప లాభాలతో బయటపడాలని అన్నారు. పొజిషనల్ ట్రేడర్స్ మాత్రం కొనుగోలు చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు.