17,100పైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17148ని తాకిన నిఫ్టిఇపుడు 17135 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 182 పాయింట్ల లాభంతోంది. సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంతో 57242 వద్ద ట్రేడవుతోంది. నిన్న భారీగా క్షీణించిన నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ ఇవాళ 1.5 శాతం లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టి నుంచి కూడా నిఫ్టికి గట్టి మద్దతు లభిస్తోంది. నిఫ్టి మొత్తం 50 షేర్లూ లాభాల్లో ఉండటం విశేషం. బజాజ్ ఆటో 3.3 శాతం లాభంతో టాప్‌లో ఉంది. మిడ్ క్యాప్‌లో టీవీఎస్ మోటార్స్, భారత్ ఫోర్జ్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టిలో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్. చాలా రోజుల తరవాత సూచీలోని మొత్తం 12 షేర్లు లాభాల్లో ఉన్నాయి.