For Money

Business News

25000 తాకినా….

ప్రధాని మోడీ జీఎస్టీ మార్కెట్‌ను 25000 స్థాయిని తాకేలా చేసింది. అధిక స్థాయిలో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి దాదాపు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. పది గంటల ప్రాంతంలో ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 25022ని తాకిన నిఫ్టి… తరవాత రోజంతా గ్రీన్‌లో ఉన్నా… క్రమంగా లాభాల స్వీకరణతో ఒత్తిడికి లోనైంది. క్లోజింగ్‌ సమంలో 24852ని తాకినా… క్లోజింగ్‌ 24876 వద్ద ముగిసింది. ఐటీ, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల షేర్ల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి చాలా వరకు లాభాలను కోల్పోయింది. ఇవాళ నిఫ్టి కన్నా స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లలో గట్టి మద్దతు లభించింది. ఆటో, కన్‌జంప్షన్‌, రియాల్టి, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కూడా డిమాండ్‌ కొనసాగింది. ముఖ్యంగా ఆటో షేర్లలో వచ్చిన గట్టి లాభాల కారణంగా టాప్‌ గెయినర్స్‌లో ఈ షేర్లే ఉన్నాయి. నిఫ్టి50లో మారుతీ ఏకంగా 9 శాతం దాకా లాభపడింది. ఇక హీరో మోటో కార్ప్‌ 6 శాతం పెరగ్గా, బజాజ్‌ ఆటో 4.6 శాతం లాభపడింది. ఇక కన్‌జంప్షన్‌లోని నెస్లే 5 శాతం పైగా పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీలలో బజాజ్‌ ఫైనాన్స్‌ కూడా 5 శాతంపైగా లాభపడింది. నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఐటీసీ, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ ఉన్నాయి. ఈ షేర్లన్నీ ఒక శాతం దాకా నష్టపోయాయి.

Leave a Reply