For Money

Business News

బ్యాంకు నిఫ్టి ఆదుకున్నా…

ఫెడ్‌ నిర్ణయం ముందు స్టాక్‌ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, యూరో మార్కెట్లు మాత్రం రెడ్‌లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ స్వల్ప లాభాల్లో ఉండటం వల్లనేమో… మన మార్కెట్లు చివర్లో ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్‌ సెషన్‌ సమయంలో కొత్త ఆల్‌టైమ్‌ హైని తాకిన సూచీలు.. తరవాత లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లో ముగిశాయి. గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి దాదాపు 200 పాయింట్లు కోల్పోయి 25,285 పాయింట్ల ను తాకింది. అక్కడి నుంచి కోలుకుని 41 పాయింట్ల నష్టంతో నిఫ్టి 25377 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిని భారీ నష్టాల నుంచి కాపాడింది బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ షేర్లేనని చెప్పాలి. అనూహ్యంగా గతకొన్ని రోజులుగా పెరుగతూ వచ్చిన ఐటీ షేర్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో 33 షేర్లు నష్టాలతో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్షియల్‌ సూచీలు ఒక శాతంపైగా లాభంతో క్లోజ్‌ కాగా, మిడ్‌ క్యాప్‌ షేర్లు ఒక శాతంపైగా నష్టపోయాయి. ఇక నిఫ్టి టాప్‌ గెయినర్స్‌ విషయానికొస్తే శ్రీరామ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, నెస్లే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ముందున్నాయి. ఇందాక అనుకున్నట్లు నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో అన్నీ ఐటీ కంపెనీలే. వీటిలో టీసీఎస్‌ టాప్‌లో ఉండగా.. తరవాతి స్థానాల్లో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, విప్రో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లలో భారీగా నష్టపోయిన షేర్లలో మెజారిటీ షేర్లు ఐటీ కంపెనీలే ఉండటం విశేషం. ఎంఫసిస్‌, పర్సిటెంట్‌, కోఫోర్జ్‌, కాన్‌కార్‌, కుమిన్స్‌ ఇండియా టాప్‌ ఫైవ్‌ లూజర్స్‌లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలో బంధన్‌ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

Leave a Reply