15,800 వద్ద నిఫ్టి బోల్తా
నిఫ్టికి 15,800 స్థాయికి ఓ గోడలా మారింది. ఈ స్థాయికి వచ్చినపుడల్లా భారీ ఒత్తిడి వస్తోంది. ఇవాళ కూడా సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి కాస్త బలహీనంగా ప్రారంభమైంది. అయినా ఓపెనింగ్‌లోనే 15,796ని తాకింది. లాభాల స్వీకరణతో కొన్ని నిమిషాల్లోనే 15,751స్థాయిని తాకింది. టెక్నికల్‌గా నిఫ్టికి 15,750 వద్ద మద్దతు ఉంది. అక్కడి నుంచి కోలుకుని నిఫ్టి ప్రస్తుతం 15,762 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 70 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి 15,750 పైన ఉన్నంత వరకు ఢోకా లేదు. ఈ స్థాయి దిగువకు వస్తే మాత్రం 15,710కు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొనుగోలు చేయాలంటే 15,650 – 15,640 వరకు ఆగండి. లేదంటే అధిక స్థాయిలో అమ్మి, స్వల్ప లాభాలతో బయటపడటమే. అమెరికా ఫ్యూచర్స్ వీక్‌గా ఉన్నాయి. యూరో మార్కెట్ వీక్‌గా ఉంటే నిఫ్టి మరింత పడే అవకాశముంది. రియాల్టీ షేర్లలో ఇవాళ కూడా కొనుగోలు ఆసక్తి కనిపిస్తోంది.
నిఫ్టి టాప్ గెయినర్స్
ఐసీఐసీఐ బ్యాంక్ 657.75 1.78
ఎన్టీపీసీ 119.70 1.57
గ్రాసిం 1,559.95 1.55
హెచ్డీఎఫ్సీ 2,504.45 1.11
టాటా మోటార్స్ 310.80 1.09
నిఫ్టి టాప్ లూజర్స్
అదానీ పోర్ట్స్ 710.80 -1.01
టాటా కన్జూమర్ 769.45 -0.83
టెక్ మహీంద్రా 1,050.00 -0.62
హెచ్‌సీఎల్ టెక్ 974.20 -0.54
ఇన్ఫోసిస్ 1,541.85 -0.39