నిఫ్టి… అధిక స్థాయిలో ఒత్తిడి
నిఫ్టి ఇవాళ అధిక స్థాయిలో ఒత్తిడికి గురౌతోంది. ఉదయం16,854 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత స్వల్ప ఒత్తిడికి లోనై 16,778ని తాకింది. కాని అక్కడి నుంచి కోలుకుని 16945ని తాకింది. మిడ్ సెషన్లో మొదలైన యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. సూచీలు 1.5 శాతం నుంచి 2 శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో మాత్రం స్వల్ప ఒత్తిడి రావడంతో ఇపుడు 16825 పాయింట్ల వద్దకు క్షీణించింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున.. నిఫ్టిలో హెచ్చు తగ్గులు అధికంగా ఉన్నాయి. మిడ్ క్యాప్ సూచీ 1.3 శాతం లాభంతో ఉంది. నిన్న భారీగా క్షీణించిన బ్యాంకు షేర్లు ఇవాళ కోలుకున్నాయి.