18400 దగ్గరగా నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18394ని తాకిన నిఫ్టి ఇపుడు 18375 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో నిఫ్టి ట్రేడవుతోంది. క్రూడ్ ధరలు భారీగా తగ్గినందున ఊహించినట్లు ఏషియన్ పెయింట్స్ రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బ్లాక్ డీల్ పూర్తవడంతో నౌకా షేర్ అయిదు శాతంపైగాలాభంతో రూ.195 వద్ద ట్రేడవుతోంది. కమాడిటీ షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి. ఎన్ఎండీసీ నాలుగు శాతంపైగా పెరగ్గా, వేదాంత కూడా 3 శాతం దాకా లాభపడింది. ఇండియన్ హోటల్స్ షేర్‌కు రూ. 310 ప్రాంతంలో మద్దతు లభిస్తోంది. టాటా మోటార్స్ రూ. 424 వద్ద ట్రేడవుతోంది. రూ. 420 దిగువన టాటా మోటార్స్‌లో ఒత్తిడి రావొచ్చు.