For Money

Business News

18300 చేరువలో నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18296ని తాకింది. ఇది రెండో ప్రధాన అవరోధం కావడంతో… ఒత్తిడి వచ్చింది. చాలా వరకు ఆల్గో ట్రేడింగ్‌ ప్రకారం ట్రేడింగ్‌ సాగుతోంది. నిఫ్టి ప్రస్తుతం 18244 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 41 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్‌ నిఫ్టి కొత్త ఆల్ టైమ్‌ హై 41939ని తాకిన తరవాత ఇపుడు 41770 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్‌లో అధిక స్థాయిలో ఒత్తిడి వస్తోంది. నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీ నిజానికి నష్టాల్లో ఉంది. ఇక షేర్ల విషయానికొస్తే … కోల్‌ ఇండియా షేర్‌ ఫలితాలు స్పందిస్తోంది. మూడు శాతం లాభంతో ఈ షేర్‌ ట్రేడవుతోంది. అలాగే అదానీ పోర్ట్స్‌లో అప్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. బ్రిటానియా ఇవాళ కూడా ఒక శాతం పైగా లాభపడటం విశేషం. ఇక నెస్లే కూడా జోరుపై ఉంది. షేర్‌ ధర రూ.20,000ను దాటింది. ఇక దివీస్‌ ల్యాబ్‌ ఇవాళ కూడా రెండున్నర శాతం క్షీణించింది. మొన్న ఈ షేర్‌ 8 శాతంపైగా తగ్గిన విషయం తెలిసిందే. ఫలితాలు మార్కెట్‌ను నిరాశపర్చాయి. ఇక ఇవాళ హిందాల్కో టాప్‌ లూజర్‌గా నిలిచింది.