నిఫ్టి : ఓపెనింగ్‌లోనే ఒత్తిడి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. కాని తొలి ప్రతిఘటన స్థాయి వద్ద అనుకున్నట్లే ఒత్తిడి వచ్చింది. 15800 స్టాప్ లాస్‌తో అమ్మినవారికి వెంటనే ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. మార్కెట్ ప్రారంభమైన 5 నిమిషాలకు నిఫ్టి 15,785ని తాకింది. అక్కడ వచ్చిన లాభాల స్వీకరణతో నిఫ్టి 15,739కి క్షీణించింది. నిఫ్టి ప్రస్తుతం 15,741 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 32 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టికి క్రితం ముగింపు వద్ద మద్దతు అందుతుందా లేదా 15,670ని తాకుందా అనేది చూడాలి. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్లోఉన్నందున నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందే ఛాన్స్ ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. అదొక్కటే ఆందోళన కల్గిస్తున్న అంశం. ఇతర సూచీల విషయానికొస్తే అన్నీ గ్రీన్‌లో ఉన్నా… మిడ్ క్యాప్ సూచీ మాత్రం అర శాతం లాభంతో ఉంది. మిగిలినవి నామ మాత్రపు లాభాలే.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా మోటార్స్ 291.85 2.60
హెచ్‌సీఎల్ టెక్ 1,001.70 1.89
టైటాన్ 1,750.95 1.59
టెక్ మహీంద్రా 1,133.00 1.20
ఎం అండ్ ఎం 736.45 1.06
నిఫ్టి టాప్ లూజర్స్
మారుతీ 7,015.90 -2.08
సిప్లా 881.45 -0.95
ఐషర్ మోటార్స్ 2,531.10 -0.76
టాటా కన్జూమర్ 750.00 -0.65
బజాజ్ ఆటో 3,795.00 -0.62