For Money

Business News

భారీ నష్టాల్లోకి…

కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిన్న ఫలితాలు ప్రకటించిన భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు సిప్లా కూడా ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిరాశజనక ఫలితాలు ప్రకటించిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ కష్టాలు ఇంకా తీరలేదు. ఇప్పటికే భారీగా నష్టపోయిన ఈ షేర్‌ ఇవాళ మరో రెండు శాతం నష్టపోయింది. అలాగే ఆటో షేర్లకు కష్టాలు తప్పడం లేదు. టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం షేర్లు రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ఉన్న షేర్లలో ఒక్క ఎన్‌టీపీసీ మాత్రమే రెండు శాతం లాభంతో ఉంది. నిన్న టాప్‌ లూజర్‌గా ఉన్న బీఈఎల్‌ ఇవాళ లాభాల్లో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది. ఉదయం 24378ని తాకిన నిఫ్టి తరవాత భారీగా నష్టపోయింది. నిఫ్టి ప్రస్తుతం 129 పాయింట్ల నష్టంతో 24209 వద్ద ట్రేడవుతోంది.