వంద పాయింట్ల నష్టంతో నిఫ్టి
మార్కెట్ ప్రారంభానికి ముందు సింగపూర్ నిఫ్టి చాలా ఫాస్ట్‌గా క్షీణించింది. దాదాపు వంద పాయింట్లు పడింది. నిఫ్టి కూడా ఓపెనింగ్‌లో వంద పాయింట్ల నష్టంతో నిఫ్టి ఓపెన్ అయింది. ఆరంభంలోనే కీలక మద్దతు స్థాయి 18,310ని తాకింది. ఇపుడు నిఫ్టి 18321 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 98 పాయింట్ల నష్టంతో పోయింది. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ నిఫ్టిలో 5 షేర్లు లాభాల్లో ఉండగా, 45 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లాభాల్లో అయిదు షేర్లు కూడా కేవలం నామమాత్రమే. ఇక నిఫ్టిలో నష్టాల్లో ఉన్న షేర్లలో మారుతీ ఉంది. చాలా రంగాల షేర్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. ఐటీతో పాటు ఫార్మా షేర్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. దివీస్ ల్యాబ్, లారస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టితో పాటు ఫైనాన్షియల్ షేర్లలో కూడా లాభాల స్వీకరణ కన్పిస్తోంది. ప్రమోటర్లు కొంత వాటాను బ్లాక్‌డీల్ కింద అమ్ముతున్నందున డాబర్ షేర్ 2.55 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ బ్యాంక్ నిఫ్టిని చూస్తే.. నష్టాల్లో ఉన్న షేర్లన్నీ ప్రైవేట్ బ్యాంక్ షేర్లు కావడం విశేషం.