MID SESSION: 18100 ప్రాంతానికి నిఫ్టి
ఇవాళ టెన్నికల్ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 18,350పైన గట్టి ఒత్తిడి వచ్చింది. 18,384ని తాకిన రతవాత నిఫ్టి ఏకంగా ఏకంగా 180 పాయింట్లు క్షీణించింది. దీంతో మిడ్ సెషన్లో 18106 పాయింట్లకు పడింది. షార్ట్ సెల్లర్స్ ఇవాళ కూడా కనకవర్షమే. ప్రస్తుతం 134 పాయింట్ల నష్టంతో 18,132 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి కన్నా నిఫ్టి నెక్స్ట్, మిడ్ క్యాప్ సూచీలు భారీగా నష్టపోయాయి. బ్యాంక్, ఫైనాన్షియల్ సూచీలు మార్కెట్‌కు అండగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన కొటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఉదయం 5 శాతం కన్నా అధిక లాభంతో ఉన్న ఐఆర్‌సీటీ ఇపుడు ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది. వీక్లీ డెరివేటివ్స్ ముగింపు ఇవాళే కావడంతో… నిఫ్టి కోలుకుంటుందా లేదా 18100 దిగువకు వెళుతుందా అన్నది చూడాలి.