For Money

Business News

నష్టాల్లో నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18003ని తాకి ఇపుడు 18018 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 83 పాయింట్ల నష్టంతో ఉంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు నష్టాల్లో ఉన్నాయి. అత్యధికంగా బ్యాంక్‌ నిఫ్టి 0.74 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్‌ దాదాపు క్రితం స్థాయి వద్దే ట్రేడవుతోంది. టాటా మోటార్స్‌ ఇవాళ 6 శాతం దాకా లాభపడింది. ఈ షేర్‌ మళ్ళీ రూ. 400ను దాటింది. అయితే టీసీఎస్‌ ఫలితాలు మార్కెట్‌ను ఆకట్టుకోలేకపోయాయి. షేర్‌ రెండున్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఐటీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. ఇన్ఫోసిస్‌ ఒక శాతంపైగా నష్టపోయింది. మదర్సన్‌ సుమి రెండు శాతం లాభపడింది. అరబిందో ఫార్మా ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది.