For Money

Business News

30, 31 తేదీల్లో బ్యాంకులు బంద్‌!

ఈ నెలాఖర్లో వరుసగా రెండు రోజులు బ్యాంకులు పనిచేయవు. 30, 31 తేదీల్లో సమ్మెకు దిగాలని బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. దీంతో చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేయవు. వివిధ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేయాలని ఇక్కడ జరిగిన బ్యాంక్‌ ఉద్యోగుల ఐక్య మండలి (యూఎఫ్‌బీయూ) సమావేశంలో తీర్మానించినట్టు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లలో… వారానికి అయిదు పని దినాలు, పెన్షన్‌ అప్‌డేషన్‌, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ రద్దు, జీతాల పెంపు, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లు ఉన్నాయి.