For Money

Business News

చరిత్ర సృష్టించిన బంగారం

బులియన్‌ మార్కెట్‌లో బంగారం మెరిసిపోతోంది. దేశ చరిత్రలో తొలిసారిగా పది గ్రాముల బంగారం ధర… ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో… రూ.56,245లను తాకింది. వచ్చే నెలలో డెలివరీకి ఉద్దేశించిన ఈ కాంట్రాక్ట్‌… ఇవాళ ఆల్‌ టైమ్‌ ధర వద్ద ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలహీనం పడటం, మాంద్యం భయాలతో బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది. వాస్తవానికి అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర ఇవాళ 1,907 డాలర్లు పలికింది. అక్కడి మార్కెట్‌లో ఆల్‌ టైమ్‌ హై ధర గత ఏడాది మార్చిలో నమోదైంది. గత ఏడాది మార్చి 8వ తేదీన ఔన్స్‌ బంగారం ధర 2070 డాలర్లు పలికింది. అమెరికా మార్కెట్‌లో ఆల్‌ టైమ్‌ ధరను దాటకున్నా… మన మార్కెట్‌లో కొత్త రికార్డు నమోదైంది. దీనికి ప్రధాన కారణం డాలర్‌తో మన కరెన్సీ విలువ పడిపోవడమే. డాలర్‌తో పాటు బంగారం ధర పెరిగితే మన మార్కెట్‌ ధర ఇంకా పెరిగే అవకాశముంది.