For Money

Business News

కుప్పకూలిన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనైన కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 17160ని తాకింది. ఇపుడు 17,193 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 285 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 1020 పాయింట్ల నష్టంతో 57337 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. నిఫ్టిలో టాప్‌ లూజర్‌గా ఉన్న ఇన్ఫోసిస్‌ 6 శాతంపైగా నష్టపోయింది. ఫలితాలు ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా 2.5 శాతంపైగా నష్టపోయింది. ఇన్ఫోసిస్‌ కారణంగా మొత్తం ఐటీ రంగ షేర్లలో ఒత్తిడి వస్తోంది. ఇక ముడి చమురు ధరలు భారీగా పెరిగినందున ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఫార్మా షేర్లు కాస్త బలంగా ఉన్నాయి. దివీస్‌ ల్యాబ్‌ ఓపెనింగ్‌లో ఒక మోస్తరుగా నష్టపోయినా.. వెంటనే లాభాల్లోకి వచ్చింది. సూచీలన్నీ నిఫ్టి స్థాయిలో క్షీణించడం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌ ఒక్కటే ఒక శాతం నష్టానికి పరిమితమైంది. మిగిలిన సూచీలన్నీ 1.7 శాతంపైగా నష్టపోయాయి.