For Money

Business News

నిఫ్టికి 300 పాయింట్ల నష్టం

నిఫ్టి ఓపెనింగ్‌లోనే భారీగా నష్టపోయింది. నిఫ్టి 300 పాయింట్లకుపైగా నష్టంతో 15917 పాయింట్లను తాకింది. ఇపుడు 15966 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 278 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందంటే నిఫ్టిలోని 50 షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్‌ అంచనాలకు మించి పనితీరు కనబర్చిన ఐటీసీ షేర్‌ కూడా ఇవాళ నష్టాలతో ప్రారంభమై.. ఇపుడు ఏకైక నిఫ్టి గెయినర్‌గా నిలిచింది. బయో ఫ్యూయల్‌ పాలసీపై ఆశలతో పెరిగిన చక్కెర షేర్లలో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. నిఫ్టి 2 శాతం వరకు ఉండగ, ఇతర సూచీల నష్టాలు 2.5 శాతంపైగా ఉన్నాయి. టెక్‌ షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో టెక్‌ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్‌ షేర్లు ఉన్నాయి. మిగిలిన సూచీల్లో దాదాపు గెయినర్స్‌ లేవనే చెప్పాలి. ముఖ్యంగా మొన్నటి దాకా ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించిన ఐటీ మిడ్‌ క్యాప్‌ షేర్లన్నీ జెట్‌ స్పీడ్‌తో పతనమౌతున్నాయి. నిఫ్టికి ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్ ఉన్నందున.. 15900 స్థాయి బ్రేక్‌ అవుతుందని చూడాలి.