For Money

Business News

నిఫ్టికి యూరో దెబ్బ

ఉదయం నుంచి భారీ నష్టాల్లో ట్రేడవుతున్న నిఫ్టి మిడ్‌ సెషన్‌లో కాస్త కోలుకున్నట్లు కన్పించినా… యూరో మార్కెట్ల దెబ్బకు మళ్ళీ క్షీణించింది. ఉదయం 17462 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి తరవాత కోలుకుని 17535 పాయింట్లకు కోలుకుంది.అయితే యూరో మార్కెట్లు ఏకంగా రెండు శాతం దాకా నష్టంతో ప్రారంభం కావడంతో నిఫ్టి డీలా పడింది. ఉదయం హాంగ్‌సెంగ్, చైనా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా.. మన మార్కెట్లపై అమెరికా, యూరో మార్కెట్లపై అధిక ప్రారంభం ఉంటుంది. ప్రస్తుతం 200 పాయింట్ల నష్టంతో 17473 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఏ స్థాయిలోనూ నిఫ్టికి మద్దతు రావడం లేదు. ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లు నిఫ్టికి కాస్త అండగా ఉన్నాయి. అయితే ఇవి కూడా నామ మాత్రపు లాభాలే. ఇక మెటల్స్‌ షేర్లు నిఫ్టిని బాగా దెబ్బతీశాయి. అలాగే టాటా మోటార్స్‌ 3.5 శాతం నష్టంతో ఉంది. హిందాల్కో ఆరు శాతంపైగా నష్టంతో ఉంది.