For Money

Business News

నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 17056ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17072 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 128 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ కూడా 376 పాయింట్ల నష్టంతో 56975 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 41 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నా.. అన్నీ అరశాతం లోపే ఉన్నాయి. ఇతర మార్కెట్ల మాదిరిగా భారీ నష్టాల్లో మాత్రం లేవు. అయితే ఆరంభ స్థాయి నుంచి మార్కెట్‌ పతనం కావడం సహజం. ఎందుకంటే ఆరంభంలో మార్కెట్‌ సెటిల్‌ కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. నిఫ్టిలో ఇవాళ కూడా అదానీ పోర్ట్స్‌ టాప్‌ గెయినర్‌లో ముందుంది. నిన్న ఫలితాలు ప్రకటించిన బజాజ్‌ ఫైనాన్స్‌ 3.67 శాతం నష్టంతో రూ.6974 వద్ద ట్రేడవుతోంది. పలు రేటింగ్‌ సంస్థలు బజాజ్‌ ఫైనాన్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. పలు సంస్థలు రూ.6000 టార్గెట్‌గా నిర్ణయించాయి. నిఫ్టి నెక్ట్స్‌ సూచీలో కూడా అదానీ ట్రాన్స్‌మిషన్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.