స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. సూచీలన్నీ నష్టాల్లో ఉన్నా… నష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. నిఫ్టి 17593ని తాకిన తరవాత ఇపుడు 17,509 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50 పాయింట్లు తగ్గింది. బ్యాంక్ నిఫ్టి స్థిరంగా ఉంది. అలాగే ఫైనాన్షియల్ నిఫ్టి కూడా. గోద్రెజ్ ప్రాపర్టీస్ భారీ నష్టాలతో మిడ్‌క్యాప్ సూచీ 0.64 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నా ఐటీసీ కేవలం 0.6 శాతం మాత్రమే లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో ఓఎన్‌జీసీ షేర్ 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇపుడు 2.6 శాతం లాభంతో రూ.171.85 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో ఇన్ఫోసిస్, విప్రో నష్టాల్లో ముందున్నాయి.