OPENING: 16300 దిగువన నిఫ్టి
నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16300 స్థాయిని కోల్పోయింది. 16278 స్థాయిని తాకిన తరవాత ఇపుడు 16,304 వదద 174 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 45 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నాలుగు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని సూచీలు ఒక శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. వాస్తవానికి నిన్నటి ఉదయం కన్నా షేర్లు ఇవాళ మెరుగ్గా ఉన్నాయి. నిన్న నిఫ్టి 16246 ప్రాంతానికి చేరిన విషయం తెలిసిందే. నిఫ్టి పరిస్థితి ఇలా ఉంటే.. షేర్లు మాత్రం భారీగా నష్టపోయాయి. బైబ్యాక్ ప్రకటించిన బజాజ్ ఆటో కేవలం ఒక శాతం లాభంతో రూ.3916 వద్ద ట్రేడవుతోంది. మిగిలిన మూడు షేర్లు నామమాత్రపు లాభాల్లో ఉన్నాయి. ఇక నష్టాల్లో మెటల్స్ ముందున్నాయి. హిందాల్కో, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. నిన్న నాస్డాక్ పతన ప్రభావం కూడా మన మార్కెట్లపై కన్పిస్తోంది. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో ఏకంగా 46 షేర్లు నష్టపోగా కేవలం మూడు షేర్లు లాభాల్లో ఉన్నాయి. వేదాంత, సెయిల్, ఎన్ఎండీసీ షేర్లు రెండు శాతంపైగా నష్టంతో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌క్యాప్‌లో పరిస్థితి మరీదారుణంగా ఉంది. సూచీలోని 25 షేర్లూ నష్టాల్లో ఉన్నాయి. రెండు శాతం నష్టంతో వోల్టాస్ టాప్‌లో ఉంది. నిఫ్టి బ్యాంక్ పరిస్థితి అంతే. సూచీలోని అన్ని షేర్లూ నష్టాల్లోనే. కొటక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు టాప్‌లో ఉన్నాయి.