నిఫ్టి: అమ్మినోడు అదృష్టవంతుడు
షార్ట్ సెల్లర్స్‌కు బంపర్ ఓపెనింగ్. ఓపెనింగ్‌లోనే వంద పాయింట్ల లాభం. ఆల్గో ట్రేడింగ్ జిందాబాద్ అన్నట్లు ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేస్తున్నారు. 17,300 వద్ద ప్రధాన ప్రతిఘటనగా టెక్నికల్స్ చెప్పాయి. 17298 వద్ద చాలా మంది సెల్ పెట్టారు.దీంతో నిఫ్టి అక్కడి నుంచి పడటం ప్రారంభమైంది. 17,210 తొలి మద్దతు స్థాయి. మధ్య ఎక్కడా ఎలాంటి లెవల్స్ లేవు. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17190ని తాకింది. అంటే షార్ట్ సెల్లర్స్‌కు వంద పాయింట్లకు పైగా లాభం. రాత్రి నాస్డాక్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చినా… రూపాయి పతనం ఐటీ షేర్లకు మద్దతు లభిస్తోంది. దాదాపు అన్ని ప్రధాన ఐటీ షేర్లు, మిడ్ క్యాప్ ఐటీ షేర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. ఈ లాభాలు కూడా ఎంత వరకు నిలబడతాయో చూడాలి. నిఫ్టిలో 42 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. మిడ్ క్యాప్ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్, బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి ఫైనాన్షియల్స్ అర శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ 5 శాతం డౌన్. దాదాపు అన్ని బ్యాంకులు క్షీణిస్తున్నాయి. ఇక ఆటో షేర్లలోనూ పతనం కొనసాగుతోంది.